Friday, December 13, 2019
Follow Us on :

కుల్‌భూషణ్ జాదవ్ జీవితంలో ఈ రోజు చాలా కీలకం

By BhaaratToday | Published On Jul 17th, 2019

గూఢచర్యం ఆరోపణలతో 2016లో జాదవ్‌ను ఇరాన్ నుంచి జాదవ్‌ను పాక్‌ ఏజంట్లు కిడ్నాప్‌ చేశారు. అనంతరం బలూచిస్థాన్లో ప్రవేశించినట్టు ప్రకటించారు.   2017 ఏప్రిల్‌లో పాకిస్థాన్‌ మిలిటరీ కోర్టు అతడికి మరణశిక్ష విధించింది. అయితే ఇరాన్‌లో ఉంటున్న జాదవ్‌ను పాక్‌ కిడ్నాప్‌ చేసిందని భారత్‌ ఆరోపించింది. పాక్‌ విధించిన మరణశిక్షను సవాల్‌ చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం 2017 మే 18న జాదవ్‌ మరణశిక్షపై స్టే విధించింది. 

Image result for కుల్‌భూషణ్ జాదవ్

ఆయన జీవితంలో ఈ రోజు చాలా కీలకం కానుంది. నేటి మధ్యాహ్నం మూడు గంటలకు కుల్‌భూషణ్ జాదవ్ కేసులో ది హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు వెల్లడించనుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్-పాకిస్థాన్ సమక్షంలో అంతర్జాతీయ న్యాయస్థానం నాలుగు రోజుల విచారణ జరిపింది. అనంతరం కేసు తీర్పును నేటికి వాయిదా వేసింది. అంతర్జాతీయ న్యాయస్థానం ఏమని తీర్పును ఇస్తుందోనని కుల్‌భూషణ్ జాదవ్ కుటుంబసభ్యులు, భారతీయులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 

Image result for కుల్‌భూషణ్ జాదవ్