Saturday, August 24, 2019
Follow Us on :

ఏటీఎంలో వ‌చ్చిన డ‌బ్బుల‌ను చూసి షాకైన క‌స్ట‌మ‌ర్‌..ఎందుకో తెలుసా..?

By BhaaratToday | Published On Mar 15th, 2019

ఏటీఎం నుంచి నగదు డ్రా చేసిన ఓ వ్యక్తి ఒక్క‌సారిగా షాక్‌కు గురయ్యాడు. అతను డ్రా చేసిన సొమ్ములో చిరిగిపోయిన రెండువేల నోట్లు రావడమే దీనికి కారణం. ఈ ఘటన విజ‌య‌వాడ‌లోని మైలవరంలో చోటు చేసుకుంది. నారాయణ థియేటర్ కాంప్లెక్స్‌లో గల స్టేట్ బ్యాంక్ ఏటీఎంలో మద్దాలి గణేష్ అనే వ్య‌క్తి  ఏటీఎం నుంచి రూ.30 వేలు డ్రా చేయగా.. అందులో10 రెండువేల రూపాయల నోట్లు చినిగిపోయినవి రావడంతో అతను ఖంగుతిన్నాడు. 30వేల‌లో ఇరవై వేలు చిరిగిపోయినవి వచ్చాయని స‌ద‌రు వ్యక్తి వాపోయాడు. ప్రభుత్వరంగ సంస్థ అయిన బ్యాంకులు సైతం ఇలా వినియోగదారులను మోసం చేస్తున్నాయని స్థానికులు మండిప‌డుతున్నారు. ఏటీఎంల‌లో చిరిగిపోయిన నోట్లు రావ‌డ‌మేంట‌ని బ్యాంకు అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇలా చాలాసార్లు చిరిగిన నోట్లు పెట్టారని ప్రజలు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలని కోరుతున్నారు.