Tuesday, October 15, 2019
Follow Us on :

గుడ్ న్యూస్ చెప్పిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..!

By BhaaratToday | Published On Sep 9th, 2019

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. రుణాలపై వడ్డీ రేటును 10 బేస్‌ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్‌ 10 నుంచి ఇప్పటి వరకు 45 బేసిస్‌ పాయింట్లు మేర రుణ వడ్డీ భారం తగ్గించింది ఎస్బీఐ. తాజా నిర్ణయంతో ఏడాది కాలపరిమితి ఉన్న ఎంసీఎల్‌ఆర్‌ ఆధారిత రుణాలపై ఇప్పటి వరకు 8.25 శాతం వడ్డీ వసూలు చేస్తుండగా, ఇకపై 8.15 శాతం వసూలు చేస్తారు. 

అయితే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై బ్యాంకులు చెల్లించే వడ్డీ రేట్లు తగ్గించింది. అన్ని కాలపరిమితులున్న రిటైల్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 20 నుంచి 25 బేసిస్‌ పాయింట్లు, బల్క్‌ డిపాజిట్లపై 10 నుంచి 20 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. ఏడాది నుంచి రెండేళ్ల కాపరిమితి ఉన్న డిపాజిట్లపై 6.7 శాతం వడ్డీ 6.5 శాతానికి తగ్గింది.  సెప్టెంబర్ 10 నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి.