Friday, March 22, 2019
Follow Us on :

6.5 అడుగుల ఎత్తు ఉండే ఉగ్రవాది.. జల్లెడ పడుతున్న భారత్

By BhaaratToday | Published On Mar 14th, 2019

పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్ తీవ్రవాదులను ఏరివేసే పనిలో పడిపోయింది. ఉగ్ర స్థావరాలను మట్టుబెడుతూ ఎప్పటికప్పుడు వాళ్ళ ఆచూకీ తెలుసుకుంటూ తీవ్రవాదులను ఏరి వేస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు ఒక తీవ్రవాదిని పట్టుకోడానికి భారత్ ప్రయత్నిస్తోంది. అతడి ఎత్తు 6.5 అంగుళాలు..! ఇంతకూ అతడెవరంటే  ఇస్మాయిల్ భాయ్ అలియాస్ లంబూ..!  జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన వాడు.. శ్రీనగర్ పరిసరాల్లోనే  దాక్కున్నాడంటూ నిఘా వర్గాలు గుర్తించాయి. గతంలో ఓ సారి ఈ లంబూ జస్ట్ మిస్సయ్యాడట.. ఓసారి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన సాయుధ దళాలను తప్పించుకు పోయాడు. ఇప్పుడు మరోసారి అతడి కదలికలను ఆరా తీస్తున్నారు అధికారులు. 

ఈ లంబూ గతేడాది డిసెంబర్ లో ఇతను భారత్ లోకి చొరబడినట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఐఈడీ పేలుడు పదార్థాలను తయారుచేయడంలో దిట్ట.   పోలీస్ ఇన్ఫార్మర్లు కూడా అతడిని చూశామని చెప్పుకొచ్చారు. శ్రీనగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే అతడి కదలికలు ఉన్నాయని ఐబీ వర్గాలు తెలుసుకున్నాయి. శ్రీనగర్ చుట్టూ 46 కిలోమీటర్ల పరిధిలో భద్రత బలగాలు జల్లెడ పడుతున్నాయి. మొన్నటి పుల్వామా దాడిలో ఉపయోగించిన ఐఈడీ బాంబును స్థానికుల సహకారంతో లంబూనే రూపొందించాడని అనుమానిస్తున్నారు.