Friday, December 06, 2019
Follow Us on :

నా కుక్క త‌ప్పిపోయింది.. ఆచూకీ తెలిస్తే..

By BhaaratToday | Published On Jul 13th, 2019

తప్పిపోయిన త‌న‌ కుక్క‌ జాడ కోసం ఆ య‌జ‌మాని చేయని ప్రయత్నం లేదు. పేపర్లలో, టీవీల్లో.. గోడ ప్రతుల ద్వారా కుక్క తప్పిపోయిందంటూ ప్రకటనలు ఇస్తున్నాడు. కుక్క ఆచూకీ తెలుపాలంటూ వీదుల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. ఈ సంఘ‌ట‌న‌ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కులవృత్తి చేసుకుని తాత్కాలిక కుటీరం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న సాలంకి శ్రీను రెండు కుక్క పిల్లలను పెంచుకుంటున్నాడు. ఇందులో ఓ కుక్క ఈనెల 8వ  తేదీ నుండి కనిపించకుండా పోయింది. కుక్క తప్పిపోయిందన్న బాధతో తీవ్ర మనోవేధనకు గురైన‌ శ్రీను ఊరంతా గాలించాడు. అయినా కుక్క ఆచూకి దొరక్కపోవడంతో ఎలాగైనా కుక్క ఆచూకీ క‌నుక్కోవాల‌ని ఫ్లెక్సీ తయారు చేసి ర‌హ‌దారి ప్రధాన కూడలిలో కట్టాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుక్క కనిపించకపోవడంతో శ్రీను దగ్గర ఉన్న మరో కుక్క కూడా బెంగపెట్టుకుంది. ఏమీ తినడంలేదు. కుక్క ఆచూకి తెలిస్తే చెప్పాలంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కుక్క తప్పిపోవడం.. ఉన్న మరో కుక్క కూడా తినడం మానేయడంతో శ్రీను కన్నీటి పర్యంతమవుతున్నాడు.