Friday, July 19, 2019
Follow Us on :

విజయ్ దేవరకొండ గ్రేట్ అన్న షాహిద్ కపూర్

By BhaaratToday | Published On May 14th, 2019

అర్జున్ రెడ్డి.. ఈ సినిమా తెలుగులో ఒక ట్రెండ్ సెట్టర్..! ముఖ్యంగా విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఈ బోల్డ్ సినిమాను పలు భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తమిళంలో రీమేక్ చేశారు కానీ.. ట్రైలర్ రిలీజ్ అయ్యాక తీవ్ర విమర్శలు రావడంతో మరోసారి షూటింగ్ చేయాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక హిందీలో షాహిద్ కపూర్ లీడ్ రోల్ లో 'కబీర్ సింగ్' పేరుతో సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ లో షాహిద్ కపూర్ మాట్లాడుతూ  ఒరిజినల్ లో నటించిన విజయ్ దేవరకొండలా చేయడం చాలా కష్టమని చెప్పుకొచ్చాడు.    


విజయ్ దేవరకొండని మ్యాచ్ చేయడం చాలా కష్టమైందని అంగీకరించాడు. అసలు రీమేక్ చేయడం అన్నదే చాలా కష్టమైన పని అని. క్యారెక్టర్ డ్రివెన్ సినిమా కాబట్టి  ఒరిజినల్ లో ఉన్నట్టు యథాతథంగా చేయడం చాలా కష్టమైంది అని చెప్పుకొచ్చాడు. అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ పెర్ఫామెన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. అతడు తన నటనతో సినిమా మొత్తం ఎమోషన్ ని క్యారీ చేసిన విధానం వండర్ అనిపించిందని చెప్పుకొచ్చాడు షాహిద్. అర్జున్ రెడ్డి బ్యూటీని ఏమాత్రం మిస్ చేయకుండా తెరకెక్కించాం. కబీర్ సింగ్ లో అది ప్రతిబింబిస్తుంది. అభిమానులు ఎవరినీ నిరాశపరచదు అని చెప్పుకొచ్చాడు షాహిద్. ఇక ట్రైలర్ ను చూసి హిందీ అభిమానులు కూడా పొగిడేస్తున్నారు.