Saturday, August 24, 2019
Follow Us on :

శంషాబాద్ విమానాశ్ర‌యంలో రూ.46లక్ష‌ల విలువ బంగారం ప‌ట్టివేత‌

By BhaaratToday | Published On Mar 16th, 2019

హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో రూ.46.25 ల‌క్ష‌ల విలువ‌గ‌ల బంగారాన్నిధికారులు ప‌ట్టుకున్నారు. డీఆర్ఐ అధికారుల తనిఖీల్లో అక్రమంగా బంగారం రవాణా చేస్తున్న ఓ ప్రయాణికుడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. మస్కట్ నుంచి వస్తున్న ఆ వ్యక్తి నుంచి రూ.46.25 లక్షల విలువైన 1398.31 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్ర‌మంగా ర‌వాణా చేస్తున్న ఆ బంగారాన్ని స‌ద‌రు వ్య‌క్తి అండర్ వేర్ లో దాచిపెట్టి, అధికారుల కళ్లుగప్పే ప్రయత్నం చేశాడు. అయితే, అధికారులు సోదాలు చేయడంతో అడ్డంగా దొరికిపోయాడు. అనంతరం, ఇంటెలిజెన్స్ అధికారులు ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు.