Saturday, August 24, 2019
Follow Us on :

ప్ర‌పంచక‌ప్‌కు ధోనీ వంటి అనుభవజ్ఞులు అవసరం

By BhaaratToday | Published On Mar 13th, 2019

టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీపై వస్తున్న విమర్శలు సరికాదని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ షేన్‌ వార్న్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘విరాట్‌ కోహ్లి సమర్థవంతమైన సారథి. అయినప్పటికీ, ఒత్తిడిలో ఉన్న సమయంలో చాలా సార్లు అతడికి ధోనీ సూచనలు చేస్తూ సాయం చేశాడు. జట్టు గెలుపు బాటలో ఉన్నప్పుడు సారథ్యం వహించడం తేలికే. కానీ, కష్టాల్లో ఉన్న సమయంలో ధోనీ వంటి అనుభవజ్ఞులు అవసరం అవుతారు. అతడు చాలా అద్భుతమైన ఆటగాడు. జట్టుకి అవసర‌మైన‌ సమయంలో అతడు ఏ స్థానంలోనయినా బ్యాటింగ్‌ చేయగలడు. చాలా సమర్థవంతమైన ఆటగాడు. అతడిని విమర్శించేవారు ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియదు’ అని వ్యాఖ్యానించారు. 

‘ప్రపంచకప్‌లో ధోనీ ఆడడం భారత్‌కు అవసరం.. జట్టుకి అతడి అనుభవం అవసరం. అతడి నాయకత్వ లక్షణాలు మైదానంలో కోహ్లికి ఉపయోగపడతాయి. ప్రపంచకప్‌కు ఎంతో సమయం లేదు. ఇందులో భారత్‌, ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్లు ఫేవరెట్‌గా ఉండనున్నాయి. ఎందుకంటే 12 నెలల కాలం పాటు ఈ జట్ల ఆట తీరు బాగుంది. ప్రస్తుతం బాగా ఆడుతున్న ఆస్ట్రేలియా ప్రపంచకప్‌ను గెలుస్తుందని నేను నమ్ముతున్నాను. అయినప్పటికీ, భారత్‌, ఇంగ్లండ్‌ జట్లే ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్నాయి’ అని షేన్‌ వార్న్‌ అభిప్రాయపడ్డారు.