Friday, July 19, 2019
Follow Us on :

ఫైనల్ లో బయటకు రాని సంచలన విషయం వాట్సన్ గాయం

By BhaaratToday | Published On May 14th, 2019

ఐపీఎల్-2019 ఫైనల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ షేన్ వాట్సన్ చివర్లో రన్ అవడం ఆ జట్టు విజయావకాశాలను భారీగా దెబ్బతీశాయి. అయితే అతడికి సంబంధించిన ఓ విషయం బయటకు వచ్చింది. షేన్ వాట్సన్ ఎంతో నొప్పిని భరిస్తూ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ మధ్య ఓవర్లలో వాట్సన్‌ మోకాలికి గాయమైంది. వాట్సన్‌ సైతం తన గాయాన్ని లెక్క చేయకుండా చెన్నై విజయం కోసం ఎంతగానో కష్టపడ్డాడు. చివర్లో రనౌట్ అవడంతో చెన్నై ఓటమిని చవిచూసింది.   

Image result for shane watson

అతడి మోకాలి వద్ద తగిలిన దెబ్బకు ప్యాంట్ మొత్తం రక్తంతో తడిచిపోయింది. ఎడమ మోకాలికి గాయమై, రక్తం కారిపోతున్నా భరించలేని బాధతో వికెట్ల మధ్య పరిగెత్తలేక అవుట్ అయ్యాడు. ప్రస్తుతం వాట్సన్ కాలి నుంచి రక్తం కారుతున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుడు హర్భజన్ సింగ్ తన సోషల్ మీడియా ఖాతాల్లో ఈ ఫోటోలను పంచుకున్నాడు. ఆరు కుట్లు వేశారని వార్తలు వచ్చాయి. వాట్సన్ గాయానికి సంబంధించిన వివరాలను చెన్నై ఫ్రాంచైజీ యాజమాన్యం అధికారికంగా వెల్లడించలేదు. వాట్సన్ చూపించిన పోరాటపటిమను క్రికెట్ అభిమానులు మెచ్చుకుంటూ ఉన్నారు. ఇంత దెబ్బ తగిలినా ఫైనల్ మ్యాచ్ చూస్తున్న వాళ్లకు అసలు తెలీలేదు.   

Image result for shane watson