Monday, November 18, 2019
Follow Us on :

క‌శ్మీర్ వేర్పాటువాదులకు షాకిచ్చిన కేంద్ర స‌ర్కార్‌

By BhaaratToday | Published On Feb 17th, 2019

కశ్మీర్ వేర్పాటువాద గ్రూపులకు కేంద్రం భారీ షాకిచ్చింది. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో వేర్పాటువాద నేతలకు ప్రభుత్వం తరఫున కల్పిస్తున్న భద్రతను ఉపసంహరించింది. మిర్వాజ్ ఉమర్ ఫరూక్, అబ్దుల్ ఘనీ భట్, బిలాల్ లోన్, హషిమ్ ఖురేషి, షబీర్ షా, సయ్యద్ అలీ షా గిలానీలకు భద్రత ఉపసంహరించినట్టు హోంశాఖ ప్రకటించింది. ప్రభుత్వం కల్పిస్తున్న ఇతర సదుపాయాలు నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం విడుద‌ల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. మరోవైపు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్.. కశ్మీర్ ఉన్నతాధికారులతో శుక్రవారం భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలు చర్చించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కొంతమంది వేర్పాటువాదులకు పాక్ నుంచి ఆర్థిక సాయం అందుతోందని.. అలాంటి వారికి ప్రభుత్వం కల్పిస్తున్న భద్రతపై పునరాలోచిస్తామని రాజ్‌నాథ్ ప్రకటించారు. ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.