Tuesday, October 15, 2019
Follow Us on :

బీజేపీ ఒక్క సంవత్సరం కూడా అధికారంలో ఉండలేదు..!

By BhaaratToday | Published On Aug 27th, 2019

కర్ణాటకలో రాజకీయాలు ఒక్కో రోజు ఒక్కో మలుపు తిరిగి.. కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. భారతీయ జనతా పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. అయితే యడ్యూరప్ప ప్రభుత్వం ఒక్క సంవత్సరం కంటే ఎక్కువ రోజులు అధికారంలో ఉండదని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చని.. యడ్యూరప్ప ప్రభుత్వం ఎక్కువకాలం నిలబడదని ఆయన అన్నారు. 

మరో వైపు సిద్ధరామయ్య కుమారస్వామిల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కుమారస్వామి తాజా ఇంటర్ వ్యూలో కూడా సిద్ధరామయ్యపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన తొలి శత్రువు సిద్ధరామయ్యేనని, ఆయన కారణంగానే రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిందని కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం పడిపోయిందంటే, అందుకు ఆయనే కారణమన్నారు. తాను ముఖ్యమంత్రిని కావడం ఆది నుంచి ఆయనకు ఇష్టం లేదని, అందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేసి ఎమ్మెల్యేలను రెచ్చగొట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ అధిష్ఠానానికి వ్యతిరేకంగా సిద్ధరామయ్య పని చేశారన్నారు.

కుమారస్వామి వ్యాఖ్యలపై సిద్ధరామయ్య తీవ్రంగా స్పందించారు. పాలన చేతకాకనే కుమారస్వామి, తన ప్రభుత్వాన్ని కూల్చుకున్నారని అన్నారు. కుమారస్వామి తనను ఎన్నడూ మిత్రుడిగా భావించలేదని... తనను నమ్మలేదని చెప్పారు. తనను మొదటి నుంచి శత్రువుగానే చూశారని రెండు పార్టీల మధ్య సమస్యలకు ఇదే కారణమని అన్నారు. చివరకు సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి దారి తీసిందని తెలిపారు.