Monday, November 18, 2019
Follow Us on :

రహదారిపై ఎక్కడ చూసినా వెండి పూసలే..!

By BhaaratToday | Published On Nov 8th, 2019

కొన్ని కొన్ని సార్లు రహదారులపై ఏవైనా వస్తువులను తీసుకొని వెళుతున్న వాహనాలకు యాక్సిడెంట్ అవ్వడం.. ఆ తర్వాత వాటిని చూసిన ప్రజలు తీసుకొని ఇంటికి వెళ్లిపోవడం జరిగిపోతూ ఉంటాయి. అలాంటి ఘటనలు ఎన్నో సార్లు జరిగాయి కూడా. వాహనాల్లో ఉన్న వాళ్లకు ఏమన్నా అయ్యిందా అని కూడా ఆలోచించకుండా కొందరు ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే ఈసారి మాత్రం రోడ్డు పైన ఎక్కడ చూసినా వెండి పూసలే..! అలాగని వాటి యజమానులు "మా వెండి పూసలు పోయాయి.. మీకేమైనా దొరికాయా..?" అని అడగలేరు. ఎందుకంటే అవి స్మగ్లింగ్ చేస్తున్నప్పుడు.. పడిపోయిన వెండి పూసలు. ఇంకేముంది దొరికినోళ్లు.. దొరికినట్లు తీసుకొని వెళ్లిపోయారు. పిల్లలు కూడా తల్లిదండ్రులకు సహాయం చేశారు.. గ్లాసుల్లో, జేబుల్లో వాటిని వేసుకొని ఇంటికెళ్లారు.  

ఈ ఘటన బీహార్ లోని సుర్సంద్ లో చోటు చేసుకుంది. రాత్రి సమయంలో కొందరు అక్రమ రవాణా చేస్తుండగా వెండి పూసలు రహదారిపై పడిపోయాయి. స్థానికులు విషయం గమనించారు. ఇంకేముంది.. దొరికినవి తీసుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. నేపాల్ నుంచి అక్రమంగా వెండిని తెచ్చి కొందరు స్మగ్లర్లు భారత్ లో విక్రయిస్తుంటారని.. వాళ్ళే ఇలా పడేసుకుని ఉంటారని చెబుతున్నారు.  

 

Image result for चांदी के दानों को