Friday, March 22, 2019
Follow Us on :

అడిషనల్‌ డీజీ అమిత్‌ గార్గ్‌ నేతృత్వంలో ఐదు పోలీసు బృందాలు

By BhaaratToday | Published On Mar 15th, 2019

వైఎస్‌ వివేకానందరెడ్డి మృతిపై విచారణ నిమిత్తం సిట్‌ ఏర్పాటు అయింది. సీఐడీ విభాగం అడిషనల్‌ డీజీ అమిత్‌ గార్గ్‌ నేతృత్వంలో ఐదు పోలీసు బృందాలు విచారణ చేయనుంది. తక్షణమే విచారణ చేపట్టాలని డీజీపీ కార్యాలయం ఆదేశాలు ఇచ్చింది.

వివేకానందరెడ్డి హత్య కేసులో నిగ్గు తేల్చేందుకు సీఐడీ అదనపు డీజీ అమిత్ గార్గ్ పర్యవేక్షణలో ప్రత్యేక విచారణ బృందాలను ఏర్పాటు చేశారు. వివేకా కేసులో సత్వర దర్యాప్తు కోసం మొత్తం 5 బృందాలను ఏర్పాటు చేశారు ఏపీ డీజీపీ ఠాకూర్. ఇప్పటికే విజయవాడ నుంచి 3 ప్రత్యేక బృందాలను సంఘటన స్థలానికి పంపించారు. ఈ బృందాలన్నింటినీ సమన్వయం చేసే బాధ్యతలను రాష్ట్ర సీఐడీ విభాగం అదనపు డీజీ అమిత్ గార్గ్ కు అప్పగించినట్టు డీజీపీ తెలిపారు. 

వైఎస్‌ వివేకానందరెడ్డిని హత్య చేశారని భావిస్తున్నామని ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ తెలిపారు. ఆయన శరీరంపై ఏడుచోట్ల గాయాలున్నాయన్నారు. ఈ కేసులో తమకు కొన్ని క్లూస్‌ దొరికాయని, వాటి ఆధారంగా విచారణ కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు.