Saturday, December 14, 2019
Follow Us on :

ఆయనకు ఎటువంటి పర్సనల్ అకౌంట్స్ లేవు..!

By BhaaratToday | Published On Sep 9th, 2019

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 చివరి దశలో విఫలమవ్వడంతో ప్రధాని మోదీతో సహా, ఇస్రో ఛైర్మన్, శాస్త్రవేత్తలు, తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మోదీ దగ్గరకు వెళ్లిన ఇస్రో ఛైర్మన్ శివన్ కంటతడి పెట్టారు. శివన్ ను మోదీ దగ్గరకు తీసుకుని, గాఢంగా హత్తుకున్నారు. తన భుజంపై శివన్ తల ఉంచుకుని, ఆయన వీపును నిమురుతూ, ధైర్యం చెప్పారు. 

ఈ ఘటన తర్వాత ఇస్రో ఛైర్మన్ శివన్ పేరు దేశ వ్యాప్తంగా మారు మ్రోగిపోయింది. ఆయన నాసాలో ఉద్యోగాన్ని వదిలేసి.. దేశం కోసం పనిచేయడం కోసం ఇస్రోలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల ఆయన పేరు మీద ఉన్న సోషల్ మీడియా అకౌంట్స్ లో పలు ట్వీట్స్ వస్తున్నాయి. దీనిపై ఇస్రో స్పందించింది. ఇస్రో ఛైర్మన్ శివన్ కు ఎటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ లేవని స్పష్టం చేసింది.