Saturday, December 14, 2019
Follow Us on :

ఆ ఆరుగురిలో ఎవరికి దక్కేనో..!

By BhaaratToday | Published On Aug 13th, 2019

భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి కోసం పోటీ మామూలుగా ఉండదు. ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందోనని క్రికెట్ అభిమానులు కూడా ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు. ప్రస్తుతం కోచ్ గా ఉన్న రవిశాస్త్రి పదవీకాలం గత వరల్డ్ కప్ తోనే ముగిసింది. కానీ వెస్టిండీస్ టూర్ కు కూడా అతడినే పంపించారు.. ఈ టూర్ అయిపోయేలోపు కొత్త కోచ్ కు సంబంధించిన కీలక ప్రకటన రానుంది.  

కోచ్ పదవి కోసం వచ్చిన దరఖాస్తులను జల్లెడ వేసి ఆరుగురిని ఫైనల్ ఇంటర్వ్యూల కోసం ఎంపిక చేసినట్టు  క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) తెలిపింది. రవిశాస్త్రితో పాటు న్యూజిలాండ్ మాజీ కోచ్ మైక్ హెసన్, ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్, శ్రీలంక కోచ్ టామ్ మూడీ, విండీస్ మాజీ ఆల్‌రౌండర్, ఆఫ్ఘనిస్థాన్ కోచ్ ఫిల్ సిమన్స్, టీమిండియా మాజీ మేనేజర్ లాల్‌చంద్ రాజ్‌పుట్, టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ రాబిన్ సింగ్ ఉన్నారు. లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్ సారథ్యంలోని సీఏసీ ముందు వీరు హాజరై తమ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. వారిలో ఎవరికి మొగ్గుచూపుతారో తెలియాల్సి ఉంది.