Wednesday, October 16, 2019
Follow Us on :

రాజకీయాల నుండి నిష్క్రమణపై సంచలన కామెంట్లు చేసిన స్మ్రితి ఇరానీ

By BhaaratToday | Published On Feb 4th, 2019

కేంద్ర మంత్రి స్మ్రితి ఇరానీ రాజకీయాల నుండి నిష్క్రమణపై సంచలన కామెంట్లు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ రాజకీయాల నుంచి తప్పుకున్న మరుక్షణం తాను కూడా తప్పుకుంటానని స్మ్రితి ఇరానీ సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దివంగత నేత అటల్ బిహారీ వాజ్‌పేయి, నరేంద్రమోడీ  నాయకత్వంలో పనిచేసే అవకాశం లభించినందుకు సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. భవిష్యత్తులో ప్రధాని కావాలన్న కోరికైతే తనకు లేదని తేల్చి చెప్పారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని, ప్రధానిగా మోడీ మరోమారు ప్రమాణ స్వీకారం చేస్తారని స్మ్రితి ఇరానీ ఆకాంక్షించారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయాన్ని బీజేపీ అధిష్ఠానం నిర్ణయిస్తుందన్నారు. మంత్రి సుష్మాస్వరాజ్, స్పీకర్ సుమిత్రా మహాజన్‌లే తనకు రాజకీయాల్లో స్ఫూర్తి అని స్మ్రితి ఇరానీ చెప్పుకొచ్చారు. పుణెలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.