Friday, December 13, 2019
Follow Us on :

రాహుల్ వయానాడ్ వెళ్లారు.. ఓడినా నేను మీతోనే ఉన్నా..!

By BhaaratToday | Published On Apr 10th, 2019

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి, అమేథీ బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ పలు వ్యాఖ్యలు చేశారు. అమేథీలో బుధవారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అ సంధర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత లోక్‌సభ ఎన్నికల్లో మీరు రాహుల్ గాంధీని గెలిపించారు. కానీ రాహుల్ గాంధీ మాత్రం ఈ ఎన్నికల్లో వయనాడ్‌ను తన మొదటి ప్రాధాన్యత లోక్‌సభ స్థానంగా ఎంచుకున్నారని స్మృతి ఇరానీ విమర్శించారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన్పటికీ నేను ఆమేథీ ప్రజలతో ఉన్నానని ఆమె అన్నారు. రాహుల్ గాంధీ నేడు నామినేషన్ దాఖలు చేసిన అనంతరం అమేథీ ప్రజలను ఓట్లు అడగపోవడాన్ని ఆమె తప్పుబట్టారు. రాహుల్ ప్రవర్తించిన తీరు ఇక్కడి ప్రజలను అవమానపరిచే విధంగా ఉందని స్మృతి ఇరానీ విమర్శించారు. అమేథీ లోక్‌సభ స్థానానికి తాను గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆమె ప్రకటించారు.