Tuesday, October 15, 2019
Follow Us on :

అక్కా.. అంటూ భావోద్వేగ ట్వీట్ పెట్టిన స్మృతి ఇరానీ

By BhaaratToday | Published On Aug 7th, 2019

కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్‌ మరణంపై పలువురు నేతలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆమెతో ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రధాని మోదీ కూడా సుష్మా స్వరాజ్ మరణంపై చాలా బాధపడుతూ ట్వీట్ చేశారు. ఇక సుష్మా స్వరాజ్ తో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. గత ప్రభుత్వంలో ఇద్దరూ కలిసి మంత్రులుగా కూడా పనిచేశారు.   

ఆమె మృతిని తట్టుకోలేని  స్మృతి ఇరానీ తనకు ఇచ్చిన మాటను నెరవేర్చకుండానే వెళ్లిపోయావంటూ ఎమోషనల్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ పెడుతూ సుష్మాతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. "‘నాకు నీతో గొడవ పెట్టుకోవాలని ఉంది అక్కా. బన్సూరీతో కలిసి నన్ను రెస్టారెంట్ కు తీసుకెళ్తానని మాటిచ్చావు. ఆ ప్రామిస్‌ను నెరవేర్చకుండానే నువ్వు వెళ్లిపోయావు" అని ఆమె ట్వీట్ చేశారు.