Saturday, October 19, 2019
Follow Us on :

మరుగుతున్న నీటిని గాల్లోకి విసిరారు.. ఆ త‌ర్వాత‌ ఏం జరిగిందంటే..?

By BhaaratToday | Published On Feb 1st, 2019

అమెరికాలోని మిడ్‌వెస్ట్ ప్రాంతం చలికి ఎంతలా గజగజలాడుతున్నదో మనకు తెలుసు. అమెరికా చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో అంటార్కిటికా కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఆ ప్రాంతంలో నమోదవుతున్నాయి. ఇప్పటికే మైనస్ 50 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ అక్కడి ప్రజలు ఎంటర్‌టైన్‌మెంట్‌ను వెతుక్కుంటున్నారు. మరుగుతున్న నీటిని గాల్లోకి విసురుతూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు. ఆ నీటిని గాల్లోకి విసరగానే అవి గడ్డ కట్టిపోవడం మనం ఈ వీడియోల్లో చూడొచ్చు. ప్రస్తుతం ట్విటర్ మొత్తం ఇలాంటి వీడియోలతో నిండిపోయింది. ఇప్పటికే కుంచించుకుపోతున్న రైలు పట్టాలను సాధారణ స్థితికి తీసుకురావడానికి వాటిని తగులబెడుతున్న వీడియోలను మనం చూశాం. తాజాగా ఈ వేడి నీళ్లు విసిరే వీడియోలు అమెరికా పరిస్థితికి అద్దం పడుతున్నాయి.