Thursday, April 25, 2019
Follow Us on :

సోష‌ల్ మీడియా ఎఫెక్ట్‌...34 మందిపై ఫిర్యాదు

By BhaaratToday | Published On Mar 21st, 2019

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న 34 మందిపై రాయచోటి టీడీపీ నియోజకవర్గ కార్యదర్శి అంజద్ అలీఖాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ గాజుల ఖాదర్ బాషాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహేశ్‌రెడ్డి అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో చంద్రబాబుపై అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ పోస్టులు పెడుతున్నాడని, వాటిని లోకేశ్ అనే వ్యక్తి షేర్ చేసి సాయం చేస్తున్నాడని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పోస్టుల‌కు మొత్తం 34 మంది కార‌కులుగా ఉన్నార‌ని ఫిర్యాదు చేశారు. వారందరిపైనా సైబర్ క్రైం కింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్న‌వారిని పోలీసులు క‌ఠినంగా శిక్షించాల‌ని వారు కోరారు.