Sunday, August 18, 2019
Follow Us on :

నేడు బీజేపీ గూటికి సోమారపు?

By BhaaratToday | Published On Jul 14th, 2019

గ‌తవారం టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన‌ మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఆదివారం సాయంత్రం బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఆయన చేరతారనే ఊహాగానాలు వినిపిస్తున్నా.. ముహూర్తం మాత్రం ఇంకా ఖరారు కాలేదు. అయితే ఈ విషయమై చర్చించడానికి బీజేపీ ఎంపీలు ధర్మపురి అరవింద్, బండి సంజయ్ ఇప్పటికే రామగుండం చేరుకుని సోమారపుతో ముచ్చ‌టించిన‌ట్లు సమాచారం. టీఆర్‌ఎస్‌లో తనకు సరైన గుర్తింపు లభించడం లేదని, కనీసం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తన మాట చెల్లుబాటు కావడం లేదని ఆరోపిస్తూ టీఆర్‌ఎస్ పార్టీకి సోమారపు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.