Sunday, August 18, 2019
Follow Us on :

సోమిరెడ్డి అయిదోసారి కూడా ఓటమే..!

By BhaaratToday | Published On May 23rd, 2019

నెల్లూరు జిల్లా సర్వేపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డికి మళ్లీ  షాక్‌ ఇచ్చారు ఓటర్లు. ఆయన వరుసగా అయిదోసారి ఓటమి చవిచూశారు. సోమిరెడ్డిపై కాకాణి గోవర్థన్‌ రెడ్డి గెలుపొందారు. ఇక చిత్తూరు జిల్లా చంద్రగిరిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి గెలుపొందారు.

 ప్రజల తీర్పు పై వైసీపీ అధినేత, కాబోయే సీఎం జగన్ స్పందించారు. రాష్ట్ర ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో వమ్ముచేయబోనని.. ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు. ఈ ఎన్నికల్లో వైసీపీ పట్ల ఆదరణ చూపిన ప్రజలందరికీ, ఓటు హక్కు వినియోగించుకున్న యావత్ రాష్ట్ర ప్రజానీకానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని.. ఇది ప్రజావిజయమని అన్నారు.