Saturday, October 19, 2019
Follow Us on :

ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యంకు మాతృవియోగం.. లండన్ లో ఎస్పీబీ..!

By BhaaratToday | Published On Feb 4th, 2019

సినీ నేపథ్య గాయకుడు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం తల్లి శకుంతలమ్మ మరణించారు. నెల్లూరులోని తిప్పరాజువారి వీధిలో ఉన్న ఆమె స్వగృహంలో కన్నుమూశారు.  ఆమె వయసు 89 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం బాలసుబ్రహ్మణ్యం లండన్‌లో ఉన్నారు. ఒక ఈవెంట్ కోసం లండన్‌కు వెళ్లిన బాలసుబ్రమణ్యం తల్లి మరణించిందన్న సమాచారం తెలియగానే హుటాహుటిన భారత్ కు పయణమయ్యారు. మంగళవారం నెల్లూరులో ఆమె అంత్యక్రియలను నిర్వహించనున్నారు.