Tuesday, October 15, 2019
Follow Us on :

మోదీ కోసం అమెరికాలో ఏర్పాటు చేసిన వంటకాలేంటో తెలుసా..?

By BhaaratToday | Published On Sep 22nd, 2019

భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయనకు వడ్డించే వంటల విషయమై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు నిర్వాహకులు.  హ్యూస్టన్ కు చెందిన ప్రముఖ భారతీయ చెఫ్‌ కిరణ్‌ వర్మ మాంచి వంటకాలను మోదీ కోసం ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నారు. స్వచ్ఛమైన భారత దేశీయ నెయ్యితో తయారు చేస్తున్నారు. రెండు రకాల నమో తాలి, నమో తాలి మిఠాయి స్పెషల్ గా చేసినట్లు తెలుస్తోంది. మిఠాయిల్లో భాగంగా రస్‌ మలాయ్, గజర్‌ కా హల్వా, బాదం హల్వా, ష్రికండ్‌ (తీపి పెరుగు) ఉంటాయని తెలుస్తోంది. తాలీలో కిచిడీ, కచోరీ, మేతి తెప్లా తదితర వంటకాలతో పాటు ఇండియాలోని పలు ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందిన వంటకాలను కిరణ్ సిద్ధం చేస్తున్నారు.
 
ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికాకు చెందిన 16 చమురు కంపెనీల సీఈఓలతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రెండు దేశాల మధ్యా కీలక ఒప్పందం కుదిరింది. అమెరికాకు చెందిన టెల్లూరియన్, ఇండియాకు చెందిన పెట్రో నెట్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ప్రతి సంవత్సరం 5 మిలియన్ టన్నుల సహజవాయువు భారత్ కు తరలించనున్నారు. మొత్తం ఒప్పందం నియమ నిబంధనలు వచ్చే సంవత్సరం మార్చి 31 నాటికి ఖరారు కానున్నాయి. మోదీతో ఆయిల్ సీఈఓల సమావేశం సక్సెస్ అయిందని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.