Thursday, December 05, 2019
Follow Us on :

సన్‌రైజర్స్ జట్టుకు కొత్త కోచ్ వ‌చ్చాడు.. ఎవ‌రో తెలిస్తే...

By BhaaratToday | Published On Jul 18th, 2019

ఐపీఎల్ 12వ సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు చేరుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. గత ఏడాది కూడా ఫైనల్స్‌కు చేరుకొని రన్నర్ అప్‌గా నిలిచిన హైదరాబాద్ జట్టు 12 సీజన్‌కి ముందు కీలక నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘంగా ఎదురుచూస్తున్న ఇంగ్లండ్ ప్రపంచకప్ కలని సాకారం చేసిన ట్రేవర్ బేలిస్‌ని జట్టు ప్రధాన కోచ్‌గా నియమిస్తున్నట్లు హైదరాబాద్ ప్రకటించింది. 

ఆస్ట్రేలియాకు చెందిన బేలిస్ గత కొంతకాలంగా ఇంగ్లండ్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలవడంతో బేలిస్ కీలక పాత్ర పోషించారు. అంతేకాక.. కేకేఆర్ జట్టు రెండు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచినప్పుడు కూడా ఆ జట్టుకు బేలిస్ కోచ్‌గా ఉన్నారు. ఇక బిగ్ బాష్ లీగ్‌లో ఆయన సిడ్నీ సిక్సర్ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.
  
కోచ్‌గా మంచి ట్రాక్ రికార్డు ఉన్న బేలిస్‌ను కోచ్‌గా నియమిస్తున్నామని.. తద్వారా హైదరాబాద్‌ జట్టును ఆయన విజయం దిశగా నడిపిస్తారని ఆశిస్తున్నట్లు ఫ్రాంచైజీ పేర్కొంది. అంతేకాక.. ఇప్పటివరకూ జట్టు కోచ్‌గా వ్యవహరించిన టామ్ మూడీకి జట్టు యాజమాన్యం ధన్యవాదాలు తెలిపింది. ఏడు సంవత్సరాలుగా జట్టుకు కోచ్‌గా ఉండి.. జట్టును ఐదుసార్లు ప్లేఆఫ్స్‌కి, ఒక సారి ఛాంపియన్‌గా చేసిన టామ్‌కు మా ధన్యవాదాలు. భవిష్యత్తులో ఆయన మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాం అంటూ హైదరాబాద్ జట్టు ట్వీట్ చేసింది.