Tuesday, May 21, 2019
Follow Us on :

శ్రీలంకలో ఆ మూడు ఇస్లాం ఉగ్ర‌వాద సంస్థలపై నిషేధం

By BhaaratToday | Published On May 15th, 2019

శ్రీలంక ప్రభుత్వం ఇస్లాం ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు గట్టి చర్యలు చేప‌ట్టింది. ఏప్రిల్ 21 ఈస్ట‌ర్ ప‌ర్వ‌దినాన కొలంబో చ‌ర్చిల‌లో వరుస ఆత్మాహుతి దాడులతో 250మందిని పొట్టనబెట్టుకున్న నేషనల్‌ తౌహీద్‌ జమాత్ తో పాటు జామాతే మిలాతే ఇబ్రహీం, విలాయత్‌ అస్‌ సైలానీ అనే మూడు ఇస్లాం తీవ్రవాద సంస్థలపై శ్రీలంక ప్ర‌భుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన క‌ఠిన‌మైన‌ ఆదేశాలను జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులిచ్చే వరకూ దేశవ్యాప్తంగా డ్రోన్ల వినియోగంపైనా ఆంక్షలు విధించారు. పుకార్లు వ్యాపించ‌కుండా అడ్డుకోవటానికి సామాజిక మాధ్యమాలపైన ప్ర‌భుత్వం క‌ట్టుదిట్ట‌మైన‌ ఆంక్షలు విధించారు.