Saturday, August 24, 2019
Follow Us on :

శ్రీహరి లేని లోటు తీర్చబోతున్నాడా..?

By BhaaratToday | Published On May 21st, 2019

శ్రీహరి.. రియల్ స్టార్ అంటూ ఒకవైపు మాస్ హీరోగా.. మరోవైపు మాంచి క్యారెక్టర్లు చేస్తూ దూసుకుపోయారు శ్రీహరి. కష్టపడి పైకి వచ్చిన ఆయన.. కెరీర్ పీక్ స్టేజిలో ఉన్న సమయంలో తుదిశ్వాస విడిచారు. శ్రీహరి లేని లోటు మన సినిమాల్లో ఇప్పటికీ కనిపిస్తూనే వుంది. ఇక ఆయన వారసులు ఎప్పుడు వస్తారా అని కూడా ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే శ్రీహరి,  శాంతి దంపతుల పెద్ద కుమారుడైన మేఘాంశ్ హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 

Image result for srihari sons

మేఘాంశ్ హీరోగా 'రాజ్ దూత్' అనే రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై సత్యనారాయణ నిర్మిస్తోన్న ఈ సినిమాకి కార్తీక్ - అర్జున్ దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. చిత్రీకరణ కొంతవరకూ పూర్తయింది. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి. శ్రీహరి ప్రస్తుతం మన మధ్య లేకపోయినా ఆయన్ని మాత్రం తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. ఆయన వారసుడు ఆయన లేని లోటును పూరిస్తాడని ఎదురుచూద్దాం. 

Image result for srihari sons