Monday, November 18, 2019
Follow Us on :

ఇంటర్ కే ప్రేమ పెళ్లి.. తెల్లవారే సరికి వధువుకు పెద్ద షాక్ ఇచ్చిన పెళ్ళికొడుకు

By BhaaratToday | Published On Oct 15th, 2019

ప్రేమ పెళ్లిళ్లు ఈ రోజుల్లో సర్వ సాధారణం అయిపోయాయి. ప్రేమ పేరుతో ఎందరో యువతీ,యువకులు పెళ్లి బంధంతో ఒకటవుతున్నారు. అయితే శ్రీకాకుళం జిల్లాలో కూడా ఇలాంటి ప్రేమ వివాహమే ఒకటి జరిగింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఉంది. ప్రేమ పెళ్లి జరిగింది కానీ తెల్లవారే సరికి వధువుకు పెద్ద షాక్ ఎదురైంది. అసలు విషయం తెలిసి ఆ పెళ్లి కూతురు బోరుమని విలపించింది. తల్లిదండ్రుల సాయంతో పోలీసుల సాయాన్ని కోరింది. అస్సలు ఆ వధువుకు ఎదురైన అనుభవం ఏంటో..!? 

 మైనర్ బాలికలపై దాడులు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. అప్పుడప్పుడే లోకాన్ని అర్థం చేసుకుంటున్న మైనర్ బాలికలను టార్గెట్ చేస్తున్నారు. ఇక కాలేజీల చుట్టూ తిరిగి మాయ మాటలు చెప్పి నమ్మిస్తున్నారు. దీంతో మైనర్ బాలికలు జీవితాలను చింద్రం  చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు ఎన్నో జరగ్గా... ప్రస్తుతం ఇలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం లో జరిగింది ఈ ఘటన. శ్రీకాకుళం జిల్లా పోలాకి చెందిన ఓ బాలిక ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. కాగా రోజు సైకిల్ పై కాలేజీకి వెళ్లి వస్తుండేది.

రోజు కాలేజీ చుట్టూ ఓ అబ్బాయి తెగ తిరిగే వాడు. ఆ అబ్బాయితో ఆమెకు పరిచయం నాలుగు నెలలు. నాలుగు నెలల పరిచయంతోనే ఆ యువకుడు దగ్గరయ్యాడు. రోజు కాలేజీకి వెళ్లొచ్చే సమయంలో వెంటపడ్డాడు. పెళ్లిచేసుకుందామని నమ్మించాడు. దీంతో అతని ప్రేమలో నిజాయితీ ఉందేమోననుకుని ఆమె కూడా అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చివరికి ఆ యువతీ కూడా పెళ్లిని కాదనలేకపోయింది. ఆ యువకుడు చెప్పినట్లుగానే పెళ్లి చేసుకునేందుకు అంగీకరించింది. ఆ బాలిక తన తాత గారి ఇంటి వద్ద ఉన్న విషయం తెలుసుకున్న ఆ యువకుడు.. బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తీసుకెళ్లాడు. 

సమీపంలోని అమ్మవారి ఆలయం వద్దకు తీసుకెళ్లి తాళి కట్టాడు. ఇక ఆ తర్వాత బాలిక తో కలిసి వెంకటేష్ అక్కడే రాత్రి గుడిలో గడిపారు. అయితే ఆ బాలిక పొద్దున లేచి చూసేసరికి వెంకటేష్ ఇచ్చిన ట్విస్ట్ కు ఆ అమ్మాయికు షాక్ కు గురైంది. ఉదయం లేవగానే వెంకటేష్‌ తన బంధువులకు ఫోన్‌ ద్వారా పెళ్లి విషయాన్ని తెలిపాడు. వెంకటేష్‌ బంధువులు అక్కడికి చేరుకొని యువతికి మెడలో వెంకటేష్‌ కట్టిన తాళిని, కాళ్లకు మెట్టెలను తీయించారు. ఆ తర్వాత నుంచి వెంకటేశ్ పరారీలో ఉన్నాడు. ఆ తర్వాత మోసపోయాను అనే విషయం గ్రహించిన బాలిక జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు వివరించింది. యువతి కుటుంబీకులు, గ్రామస్థులకు విషయం తెలియడంతో యువతికి న్యాయం చేయాలని కోరుతూ పోలాకి పోలీస్‌ స్టేషన్‌ ముందు ఆందోళన చేపట్టారు.

 బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న వెంకటేశ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇరువర్గాలను పిలిపించి చర్చలు జరిపి బాలికకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇక రోజు రోజుకి మైనర్ బాలికలు మోసపోతున్న కథనాలు చాలానే తెరమీదకు వస్తున్నాయి. వీటిని నివారించేందుకు మైనర్ బాలికలపై తల్లిదండ్రులు కాస్త జాగ్రత్త వహించాలని పోలీసులు సూచించారు.

 ఇంటర్మీడియట్ చదువుతున్న యువతి ప్రేమించి పెళ్లి చేసుకోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయస్సులోనే పిల్లలు ప్రేమ, పెళ్లి అనడం ఏంటో అని మండిపడుతున్నారు. పిల్లలు ఏ విషయమైనా ముందే తల్లిదండ్రులకు చెబితే.. సమస్యలు రాకుండా ఉంటాయని వారు హితవులు పలుకుతున్నారు. అనాలోచిత, అపరిపక్వ నిర్ణయాలు తీసుకుని తల్లిదండ్రులను బాధపెట్టవద్దని సూచిస్తున్నారు.