Wednesday, November 20, 2019
Follow Us on :

శ్రీలంక క్రికెటర్స్ ని భారత్ బెదిరించిందనే ఆరోపణలపై స్పందించిన శ్రీలంక క్రీడామంత్రి

By BhaaratToday | Published On Sep 11th, 2019

శ్రీలంక క్రికెటర్లు పాకిస్థాన్ టూర్ కు వెళ్ళకపోవడం వెనుక భారత్ ఉందని ఆరోపించాడు పాకిస్థాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ ఫవాద్ హుస్సేన్. పాకిస్థాన్ టూర్ కు కానీ శ్రీలంక క్రికెటర్లు వెళితే వారిని ఐపీఎల్ లో ఆడించబోమని బెదిరించారట.. అందుకే వారు పాకిస్థాన్ టూర్ కు రావడానికి భయపడుతున్నారని ఈ విషయాన్ని స్పోర్ట్స్ కామెంట్రేటర్లు తనకు చెప్పారని ఫవాద్ హుస్సేన్ ట్వీట్ చేశాడు. భారత అధికారులు చేసిన ఈ పనులు చాలా ఛీప్ ట్రిక్స్ అని వీటిని ఖండిస్తున్నామంటూ నోటికి వచ్చినట్లు చెప్పాడు ఫవాద్. అయితే అతడి వ్యాఖ్యలకు శ్రీలంక సమాధానం ఇచ్చింది.    

అయితే పాకిస్థాన్ లో పర్యటించకుండా తమ ఆటగాళ్లపై భారత్ ఎలాంటి ఒత్తిడి చేయలేదని శ్రీలంక క్రీడామంత్రి హరిన్ ఫెర్నాండో తెలిపారు. 2009 శ్రీలంక పర్యటన సందర్భంలో ఉగ్రదాడి జరిగిన కారణంగానే అక్కడ పర్యటించేందుకు తమ ఆటగాళ్లు భయపడుతున్నారని చెప్పారు. తమ ఆటగాళ్ల అభిప్రాయాలను తాము గౌరవిస్తామని పాక్ లో పర్యటించేందుకు ఆసక్తి చూపినవారినే ఎంపిక చేశామని తెలిపారు. 

2009లో లాహోర్ లో శ్రీలంక ఆటగాళ్ల బస్సుపై ఉగ్రదాడి జరిగింది. శ్రీలంక ఆటగాళ్ళు తీవ్ర గాయాలపాలయ్యారు కూడా. ఈ ఘటన అనంతరం విదేశీ జట్లు పాకిస్థాన్ లో పర్యటించాలంటేనే భయపడిపోతున్నాయి. చివరికి పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ కూడా వారి సొంత దేశంలో జరుపులేకపోతున్న పరిస్థితి ఆ దేశానిది.

Image

Image