Sunday, August 18, 2019
Follow Us on :

రంగంలోకి దిగిన కేంద్ర పారామిలటరీ బలగాలు

By BhaaratToday | Published On Apr 14th, 2019

శ్రీరామ నవమి సందర్భంగా అధికార యంత్రాగం, పోలీసు శాఖ అప్రమత్తమైంది. భాగ్యనగరం వేదికంగా  జరగనున్న శ్రీరామ నవమి శోభాయాత్ర నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, పోలీస్ అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. శోభయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. 


భాగ్యనగరం శ్రీరామ నవమి శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది. శోభాయాత్రకు ఇప్పటికే నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హిందూ భక్తులు, భజన బృందాల‌తో అత్యంత వైభవంగా సాగే శోభాయాత్ర నగరంలోని ఆకాష్‌పురి హనుమాన్ మందిరం నుంచి ప్రారంభమవుతోంది. దీంతో శోభయాత్రకు హిందూ భక్తులు పెద్దఎత్తున తరలిరానున్నారు. 

1600 మంది భద్రత సిబ్బంది:
మరోవైపు శోభయాత్రకు హిందూ భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో..సిటీ పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. శోభయాత్రకు మొత్తం 16వందల మంది భద్రత సిబ్బందిని రంగంలోకి దింపింది. కేంద్ర పారామిలటరి బలగాలను కూడా సెక్యూరిటీ కోసం ఉపయోగిస్తున్నారు. అంతేకాక శోభాయాత్రను నిరంతరం 192 సీసీటీవీ కెమెరాలతో పర్యవేక్షించనున్నారు. అటు సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘాను ఏర్పాటుచేశామని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. 

నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు :
ఇక శ్రీరామ నవమి శోభయాత్రకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శోభయాత్ర జరిగే సీతారాంబాగ్ నుంచి కోఠి హనుమాన్ వ్యాయామశాల వరకు వాహనాల దారి మళ్లింపుపై ఆదేశాలు జారీ చేశారు. కాగా సీతారాంబాగ్ నుంచి ప్రారంభమయ్యే శోభయాత్ర.. పురాన్‌పూల్, గౌలీగూడ, సుల్తాన్ బజార్ మీదుగా హనుమాన్ వ్యాయామ శాలకు చేరుకోనుంది. దీంతో సీతారాంభాగ్ నుంచి కోఠి వరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మరోవైపు శోభయాత్రలో భక్తులకు అలాంటి అసౌర్యాలు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు.