Monday, December 09, 2019
Follow Us on :

బోర్డర్ లో భారత్, చైనా సైనికుల మధ్య గొడవ.. కారణమేమిటంటే..!

By BhaaratToday | Published On Sep 12th, 2019

ఇప్పటికే పాకిస్థాన్-భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే..! ఇప్పుడు చైనా బోర్డర్ లో కూడా అలాంటి పరిస్థితే నెలకొంది. కావాలనే భారత్ సైనికులను రెచ్చగొట్టేలా డ్రాగన్ కంట్రీ ప్రవర్తిస్తోంది. చైనా వైఖరి కారణంగా ఇరు దేశాల సైనికులు ఒకరిని మరొకరు తోసుకున్నారు. ఉన్నతాధికారులు సరైన సమయంలో స్పందించడంతో ఈ ఘర్షణ కాస్త తగ్గుముఖం పట్టింది. 

కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్ లోని పాంగాంగ్ సో సరస్సు వద్ద భారత బలగాలు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి. భారత ఆర్మీ త్వరలో భారీ ఎత్తున సైనిక విన్యాసాలు చేపట్టనుండడంతో పెట్రోలింగ్ నిర్వహించాయి. దీనికి చైనా సైనికులు అభ్యంతరం తెలిపారు. ఆ తర్వాత ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. భారత్, చైనా సైనికులు ఈ సందర్భంగా ఒకరినొకరు తోసుకున్నారు. ఇరుదేశాలకు చెందిన బ్రిగేడియర్ స్థాయి ఆర్మీ ఉన్నతాధికారులు ఈ విషయమై చర్చలు జరపడంతో సమస్య సద్దుమణిగింది.