Sunday, August 25, 2019
Follow Us on :

తెలుగమ్మాయిని కన్నడ ప్రజలు గెలిపించుకుంటారా..?

By BhaaratToday | Published On Mar 18th, 2019

కర్ణాటక లోని మాండ్య ప్రాంతానికి.. నటుడు అంబరీష్ కు ఉన్న అనుబంధం ఇప్పటిది కాదు. బ్రతికున్నంత కాలం ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షల కోసం ఆయన ఎంతగానో పాటుపడ్డారు. ఇప్పుడు ఆ ప్రాంత ప్రజల సమస్యలను తీర్చడం కోసం అంబరీష్ భార్య సుమలత ముందుకొచ్చారు. తెలుగమ్మాయి అయినప్పటికీ మండ్యతో సుమలతకు మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు సుమలత రానున్న లోక్ సభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. కర్ణాటకలోని మండ్య నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నట్టు ఈరోజు ఆమె ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమెకు టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని ఆమె నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్-జేడీఎస్ పొత్తులో భాగంగా మండ్యను జేడీఎస్ కు కేటాయించారు. ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు హీరో నిఖిల్ పోటీ చేస్తున్నారు. అయితే కన్నడ చిత్ర పరిశ్రమ సుమలతకు అండగా నిలుస్తోంది. కర్ణాటక స్టార్ హీరోలు దర్శన్, యశ్ లు ఆమె వెన్నంటి ఉన్నారు.   

Image may contain: 3 people