Saturday, August 24, 2019
Follow Us on :

స్వరూపానంద సరస్వతి చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదన్న గాయని సునీత

By BhaaratToday | Published On Jun 12th, 2019

శ్రీ శారదపీఠాధిపతి స్వరూపానంద సరస్వతి ఆశీస్సులు తీసుకోడానికి పలువురు రాజకీయనాయకులు, వ్యాపారవేత్తలు, సినిమా నటులు, పలువురు సెలెబ్రిటీలు వస్తూనే ఉంటారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెబుతూ చెబుతూ గాయని సునీత కూడా తమ ఆశీస్సుల కోసం వస్తుంటారని చెప్పారు. సినీ ప్రముఖులు చిరంజీవి, రజనీకాంత్, రాజేంద్ర ప్రసాద్ వారి అబ్బాయి జగదీశ్ లతో పాటు గాయని సునీత తన వద్దకు వస్తుంటారని శ్రీ శారదపీఠాధిపతి స్వరూపానంద సరస్వతి ఆ ఇంటర్వ్యూలో అన్నారు. 

అయితే ఈ వ్యాఖ్యలపై గాయని సునీత స్పందించారు. ఆయన వ్యాఖ్యలకు అభ్యంతరం చెప్తూ స్వరూపానంద సరస్వతిని తానెప్పుడూ కలవలేదని అన్నారు. స్వరూపానందేంద్ర సరస్వతిని సందర్శించే వారి జాబితాలో ఆయన తన పేరును చేర్చడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు. యూట్యూబ్ లో ఆయన  ఇంటర్వ్యూ చూసిన సునీత స్పందిస్తూ తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. రోజూ ఎన్నో వదంతులు వినిపిస్తుంటాయని.. కానీ కొన్నింటిపైనే స్పందించాల్సిన అవసరం వస్తుందని అన్నారు.