Monday, November 18, 2019
Follow Us on :

అయోధ్య స్థలాన్ని వదులుకోడానికి సిద్ధమైన సున్నీ వక్ఫ్ బోర్డు.. ఆ మూడు షరతులేంటంటే

By BhaaratToday | Published On Oct 17th, 2019

అయోధ్యలో రామ మందిర నిర్మాణం అతి త్వరలో జరిగేలా కనిపిస్తోంది. హిందూ బంధువులు ఆశిస్తున్న తీర్పు అతి త్వరలో వచ్చేలా కనిపిస్తోందని అందరూ బలంగా నమ్ముతున్నారు. ఇటువంటి తరుణంలో సున్నీ వక్ఫ్ బోర్డు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. కక్షిదారుల్లో ఒకటైన సున్నీ వక్ఫ్ బోర్డు ఓ సంచలన ప్రతిపాదన చేసింది. వివాదాస్పద స్థలంపై తమకున్న హక్కును వదులుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. అయోధ్య రామజన్మభూమి - బాబ్రీ మసీదు వివాదాస్పద స్థలానికి సంబంధించి వాదనల చివరి రోజూన మధ్యవర్తిత్వ కమిటీ ద్వారా తన ప్రతిపాదనను సుప్రీంకోర్టుకు సున్నీ వక్ఫ్ బోర్డు పంపించింది.  

సున్నీ వక్ఫ్ బోర్డు విధించిన షరతులు ఏమిటంటే 

దేశంలో ఉన్న మసీదులన్నింటికీ రక్షణ కల్పించాలని.. 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని కోరారు. 

అయోధ్యలోనే మరో చోట బాబ్రీకి ప్రతిగా ఒక పెద్ద మసీదును కట్టుకునేందుకు అనుమతించాలి. అయోధ్యలో ఉన్న 22 పాత మసీదుల మరమ్మతులకు సహకారం అందించాలి.

పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్న మసీదుల్లో కూడా ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించాలని సున్నీ వక్ఫ్ బోర్డు కోరింది. 

 పై మూడు ప్రతిపాదనలపై సున్నీ వక్ఫ్ బోర్డుతో పాటు కొన్ని హిందూ పక్షాలు కూడా సంతకం చేసినట్టు తెలుస్తోంది.