Monday, November 18, 2019
Follow Us on :

రివ్యూ పిటీషన్ వేయబోమని సంచలన విషయం చెప్పిన సున్నీ వక్ఫ్ బోర్డు..!

By BhaaratToday | Published On Nov 9th, 2019

అయోధ్య కేసులో తుది తీర్పు వెల్లడైంది. అయోధ్య వివాదాస్పద స్థలం హిందువులదేనని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ తీర్పు కోసం హిందువులు ఎన్నాళ్ళ నుండో ఎదురు చూశారు.. అది ఈరోజు సాకారం అయింది. 2.77 ఎకరాల స్థలం హిందువులకే చెందుతుందని తేల్చిచెప్పేసింది. వివాదాస్పద స్థలానికి సంబంధించి 3 నెలల్లో కేంద్రం ట్రస్ట్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. వివాదాస్పద స్థలాన్ని ట్రస్ట్‌ ఆధీనంలో ఉంచాలని సూచింది. ఆలయ నిర్మాణం, ట్రస్ట్‌ విధి విధానాలపై 3 నెలల్లోగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ముస్లింలకు అయోధ్యలో 5 ఎకరాల స్థలం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 

అయితే మొదట సున్నీ వక్ఫ్ బోర్డు రివ్యూ పిటీషన్ వేయాలని భావిస్తున్నామని తెలిపారు. కానీ కొన్ని గంటల తర్వాత ఆ నిర్ణయం వెనక్కు తీసుకుంటున్నామని తేల్చి చెప్పింది. సున్నీ వక్ఫ్ బోర్డు ఆచితూచి వ్యవహరించాలని భావించాక కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీం కోర్టు తీర్పును పూర్తిస్థాయిలో సమీక్షించిన వక్ఫ్ బోర్డు, అయోధ్య వివాదంపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయకూడదని నిర్ణయించుకుంది. సుప్రీం కోర్టు తీర్పును అంగీకరిస్తున్నట్టు ప్రకటనను విడుదల చేసింది.