Thursday, April 25, 2019
Follow Us on :

యాంకర్ సుమ.. సన్ రైజర్స్ తో కలిసి సందడే సందడి..!

By BhaaratToday | Published On Mar 20th, 2019

యాంకర్ సుమ.. దశాబ్దాలుగా బుల్లితెర మీద సందడి చేస్తూనే ఉంది. సుమ షో అంటే చాలు టీవీలకు అతుక్కుపోతారు. ఇప్పటికే పలు సెలెబ్రిటీలతో కలిసి సందడి చేసిన సుమ.. ఇప్పుడు డేవిడ్ వార్నర్, లక్ష్మణ్, భువనేశ్వర్ కుమార్ లతో కలిసి నటించింది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఇంతకూ ఇదంతా దేనికి అనే కదా మీ డౌట్.. ఐపీఎల్ వచ్చేసింది కదా.. మన సన్ రైజర్స్ తో ఓ యాడ్ చేశారు. ఆ యాడ్ లో సుమ ఇలా వార్నర్ కు తినిపిస్తూ కనిపించింది. ఆ యాడ్ కూడా త్వరలో ప్రసారమయ్యే అవకాశం ఉంది. తెలుగు సంప్రదాయ వంటకాలైన మినప గారెలు, వడలను వార్నర్,  భువనేశ్వర్ కుమార్ టేస్ట్ చేశారు. 

ఇక ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ పూర్తీ షెడ్యూల్ విడుదలైంది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో ఇటీవల రెండు వారాల షెడ్యూల్‌ని విడుదల చేసిన బీసీసీఐ.. తాజాగా గ్రూప్ దశ వరకూ పూర్తీ షెడ్యూల్‌ని ప్రకటించింది. 23వ తేదీ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీకొననుంది. గ్రూప్ దశ వరకూ మ్యాచ్‌లు సాయంత్రం 4 గంటలకి, రాత్రి 8 గంటలకి ప్రారంభంకానున్నాయి. మార్చి 23 నుంచి.. మే 5న గ్రూప్ స్టేజ్ ఆఖరి లీగ్ మ్యాచ్ జరగనుంది. క్వాలిఫయర్స్, ఎలిమినేటర్, ఫైనల్‌ మ్యాచ్‌ల తేదీలు, వేదికల్ని త్వరలో ప్రకటిస్తారు. సన్ రైజర్స్ షెడ్యూల్ ఇదే..