Thursday, April 25, 2019
Follow Us on :

రాహుల్ కు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు..!

By BhaaratToday | Published On Apr 15th, 2019

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. మోదీ మీద చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని డెడ్ లైన్ కూడా విధించింది. రాఫెల్ విమానాల విషయంలో మోదీ కుంభకోణం చేశారని రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల లీకైన రాఫెల్ పత్రాల ఆధారంగా గతంలో రాఫెల్ ఒప్పందంపై ఇచ్చిన తీర్పును పున:సమీక్షించేందుకు సుప్రీం అంగీకరించింది. దీనిపై రాహుల్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు నిర్ణయంతో నైతిక విజయాన్ని సాధించామని అన్నారు. చౌకీదార్ చోర్ (మోదీ దొంగ) అని సుప్రీంకోర్టే చెప్పిందని.. వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ పార్లమెంటు సభ్యురాలు మీనాక్షి లేఖి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 

Image result for rahul gandhi supreme court

మీనాక్షి లేఖి దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం రాహుల్ గాంధీకి షాక్ ఇచ్చింది.  మోదీ దొంగతనానికి పాల్పడ్డారని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ఈ రోజు నోటీసులు జారీచేసింది. తన వ్యాఖ్యలపై ఈ నెల 22లోగా జవాబు చెప్పాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 23న చేపడతామని అన్నారు. అడ్డంగా వ్యాఖ్యలు చేసి దొరికిపోయిన రాహుల్ ఏమని సమాధానం చెప్తాడో చూడాలి.