Thursday, September 19, 2019
Follow Us on :

కార్తీ, సూర్యల మంచి మనసు.. భారీ సహాయం

By BhaaratToday | Published On Aug 17th, 2019

సాయం చేయడంలో దక్షిణాది హీరోలు సూర్య, కార్తీ ఎప్పుడూ ముందుంటారు. గతంలో ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డప్పుడు తమకు తోచినంత సహాయం చేశారు. ఇప్పుడు మరోసారి వారు  కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌ ప్రజలను ఆడుకోడానికి ముందుకు వచ్చారు. 

కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌ల‌లో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కి ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. వేల మంది ప్ర‌జ‌లు నిరాశ్ర‌యుల‌య్యారు. ఇబ్బందులు పడుతున్న కేర‌ళ‌,క‌ర్ణాట‌క ప్ర‌జ‌ల‌కి భారీ విరాళం అందించారు. వారిద్దరు ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌ల విరాళం అందించిన‌ట్టు తెలుస్తోంది. 

టాలీవుడ్ హీరో సంపూర్ణేష్ వరద బాధితుల కోసం రూ.2 లక్షల విరాళం అందజేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించారు. ‘‘ఉత్తర కర్ణాటకలో వరదలు నన్ను కలిచివేసింది. కన్నడ ప్రజలు తెలుగు సినిమాని దశాబ్దాలుగా ఆదరిస్తున్నారు. నన్ను కూడా హృదయకాలేయం నుంచి ఎంతగానో ప్రేమిస్తున్నారు. వరదల తాలూకు ఫోటోలు చూసి చాలా బాధవేసింది. నా వంతుగా 2 లక్షల విరాళం ముఖ్యమంత్రి సహాయనిదికి ప్రకటిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు. 

కేరళ వరదల్లో చనిపోయినవారి సంఖ్య 102కు చేరిందని కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. 59మంది గల్లంతయ్యారు.  
మలప్పురం జిల్లాలోని కావలప్పరలో కొండచరియలు విరిగిపడటంతో ఎక్కువ ప్రాణనష్టం వాటిల్లింది.