Tuesday, May 21, 2019
Follow Us on :

పాకిస్థాన్ కు ఉన్న ఒకే ఒక్క దారి అదే: సుష్మా స్వరాజ్

By BhaaratToday | Published On Mar 14th, 2019

పాకిస్థాన్ గత కొన్నేళ్లుగా అవలంబిస్తున్న పనులపై భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఫైర్ అయ్యారు. ఎన్నో ఏళ్లుగా పాకిస్థాన్ ఉగ్రవాదులకు కొమ్ము కాస్తూనే ఉంది.. ఉగ్రవాదులను భారత్ మీదకు పంపుతూనే ఉంది. భారత్ ఎన్ని ఆధారాలు పంపినా కూడా పాకిస్థాన్ లో మార్పు రావడం లేదు. ఎప్పటి నుండో జరుగుతోంది ఇదే..! ఈ ఘటనలపై సుష్మా స్వరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ ముందు ఒకే ఒక్క దారి ఉందని సుష్మా హెచ్చరించారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ ను భారత్ కు అప్పగించి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆమె అన్నారు. పుల్వామా తరహా ఘటన మరోసారి చోటుచేసుకుంటే, తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

ఉగ్రవాదం, చర్చలు రెండూ కలసి ముందుకు సాగవని.. ఉద్రిక్తతలను నివారించడానికి భారత్ శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని, ఇదే సమయంలో పాకిస్థాన్ నుంచి సరైన చర్యలను భారత్ ఆశిస్తోందని అన్నారు. పుల్వామా దాడుల తర్వాత భారత్ మరింత తీవ్రంగా స్పందిస్తుందని పాకిస్థాన్ ఆందోళన చెందుతోందని సుష్మ అన్నారు. పుల్వామా దాడులను ఖండిస్తూ పలు దేశాల విదేశాంగ మంత్రులు తనకు ఫోన్ చేసి, సంఘీభావాన్ని ప్రకటించారని తెలిపారు. ఇదే సమయంలో పరిస్థితి మరింత తీవ్రతరం కాకుండా చూడాలని కోరారని సుష్మ చెప్పారు. ఉద్రిక్తతలు మరింత పెరగకుండా భారత్ అన్ని చర్యలు తీసుకుంటుందని తాను వారికి చెప్పానని తెలిపారు. ఉగ్రవాదం లేని వాతావరణం కోసం పాకిస్థాన్ తో చర్చలు జరిపేందుకు తాము సిద్ధమని చెప్పారు.