Wednesday, October 16, 2019
Follow Us on :

ఎవరి దయాదక్షాణ్యాల మీద ఆధారపడే గుణం నాకు లేదు: స‌్వామి ప‌రిపూర్ణానంద‌

By BhaaratToday | Published On Jan 24th, 2019

దేశం కోసం ధర్మం కోసం ఆవిర్భవించిన భారత్ టుడే ఛాన‌ల్ వినూత్న కార్యక్రమం నిర్వ‌హించింది. స్వామి వివేకానంద , నేతాజీ స్ఫూర్తితో.. స్వామి పరిపూర్ణానంద సమక్షంలో నిన్న సాయంత్రం ఘట్ కేసర్ వీబీఐటీ ప్రాంగణంలో ‘యువ సంకల్ప్ దివస్’ కార్యక్రమాన్ని నిర్వ‌హించింది. ఈ సందర్భంగా ప్రగతిగల యువతకు భారత్ టుడే ప్రోత్సాహంతో పలు రంగాల్లో ప్రతిభ కనబర్చిన యువతీ, యువకులకు యూత్ ఐకాన్ అవార్డులు అందించారు. ఈ సంద‌ర్భంగా స్వామి ప‌రిపూర్ణానంద ప్ర‌సంగిస్తూ...దేశం కోసం ధర్మం కోసం ఆవిర్భవించిన భారత్ టుడే ఛాన‌ల్...యువ‌త కోసం వినూత్న కార్యక్రమం ప్ర‌తి సంవ‌త్స‌రం నిర్వ‌హిస్తోంద‌ని చెప్పారు. 

నాకు సన్యాసి బాట వేసింది మా అమ్మ: 
నాకు సన్యాసి బాట వేసింది మా అమ్మ అని చెప్పిన స్వామీజీ…నన్ను సన్యాసిగా తీర్చిదిద్దింది మా గురువేన‌ని వివ‌రించారు. ఏది తప్పు, ఏది ఒప్పు చెప్పడానికి  ఒక మాధ్యమం కావాల‌ని, ఎలా వెళ్లాలో చెప్పడానికి కూడా ఒక ఛానల్ కావాలి..అదే భారత్ టుడేనని చెప్పారు. నా వెనుక ధన, కులం, బంధు బలం ఏమిలేదు...మనం ఏదైనా చేయడానికి డబ్బు కావాలి... కానీ, డబ్బు కోసం మనము ఏదీ చేయరాదని స్వామీజీ త‌న సూత్రాన్ని వివ‌రించారు. ఎవరి దయాదక్షాణ్యాల మీద ఆధారపడే గుణం నాకు లేదు…ఎవ‌రికో అమ్ముడు పోవ‌డం అనేది నా జీవితంలో లేద‌ని స్వామీజీ కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. దేశం కోసం – ధర్మం కోసం చేసేదే భారత్ టుడే...మనం ఎన్ని చదివిన..మన ప్రత్యేక ఏమిటో మనం గుర్తించుకోవాలన్నారు. క్రికెట‌ర్ కావాల‌నుకున్న నేను..చివ‌ర‌కు సన్యాసిని అయ్యాన‌న్నారు.
 

నాకంటూ సమాజంలో గుర్తింపు తెచ్చుకొని మీ ముందుకు నిలబడ్డాను :
 
నేను పదోతరగతిలో ఉత్తీర్ణత సాధించపోయినా…నాకంటూ సమాజంలో గుర్తింపు తెచ్చుకొని మీ ముందుకు నిలబడ్డాన‌ని స్వామీజీ చెప్పారు. జీవితంలో అవకాశం వచ్చినప్పుడు దానిని గొప్పగా చ‌క్క‌దిద్దుకోవాల‌ని సూచించారు. పాకిస్తాన్‌లో ఇండియా జెండా ఎగురవేసిన ఘనత ప్ర‌పంచ టేబుల్ టెన్నీస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ కు దక్కుతుందన్నారు. ఓడిపోవడం అంటే వాయిదా వేసిన విజయం మాత్రమే..పరిస్థితులు మనకు అనుకూలించినా ఏమీ చేయని స్థితిలో ఉంటామన్నారు. అయితే ఎల‌క్ట్రానిక్ మినీ డ్రోన్‌, వాట‌ర్ లెవ‌ర్ ఇండికేట‌ర్‌ను త‌న సొంత తేలివితేట‌ల‌తో రూపొందించిన సిరిపురం సాయితేజ‌ను స్వామీజీ ప్ర‌శంసించారు. యూత్ ఐకాన్ అవార్డుకు ఎంపికైన సాయితేజ‌కు త‌న స‌హాయ‌ స‌హ‌కారాలు ఎల్ల‌ప్పుడు ఉంటాయ‌న్నారు. వీబీఐటీ విద్యార్థులు మీ సంవత్సరపు ఖర్చుల్లో కొద్దిగా మధ్య తరగతిలో పుట్టిన సాయి తేజకు ఇవ్వండని కోరిన స్వామీజీ, సాయి తేజ మున్ముందు అద్భుతాలు సృష్టిస్తాడ‌ని అన్నారు. నాకు వచ్చిన గురుదక్షణ కూడా నేను సాయితేజకు అంకితం చేస్తాన‌ని స్వామీజీ త‌న నిండు మ‌న‌సును చాటుకున్నారు. సాయి తేజకు భారత్ టుడే, వీబీఐటీ, తాను తోడుగా ఉన్నామని భరోసా ఇచ్చారు. భారత్ టుడే అంటే యువతకు మార్గదర్శిగా ఉంటుందన్నారు.