Monday, September 23, 2019
Follow Us on :

ఆర్టికల్ 370 రద్దుపై ఎంతో గొప్పగా చెప్పిన స్వామి పరిపూర్ణానంద

By BhaaratToday | Published On Aug 5th, 2019

జమ్మూ కాశ్మీర్ అన్నది భారతదేశానికి ఒక తల లాంటిది.. ఇంతకాలం భారత్ దేశ తలకాయను రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు కోసం తాకట్టు పెట్టాయని స్వామి పరిపూర్ణానంద అన్నారు. కానీ అమిత్ షా గారు హోమ్ మంత్రి అయ్యాక చేసిన మొదటి పని.. ఆయన దృష్టి పెట్టిన మొదటి అంశం మన తలను తాకట్టు నుండి విడిపించుకోవడమని స్వామీజీ అన్నారు. భారత దేశం అధికంగా డబ్బు పెడుతోంది జమ్మూ కాశ్మీర్ లోనే అని.. కానీ అక్కడి నుండి ఎటువంటి పన్నులు భారత్ కు చెల్లించడం లేదని స్వామీజీ అన్నారు.  ఎన్నో పవిత్రదేవాలయాలు ఉన్న నా భారతదేశంలో ప్రశాంతంగా వెళ్లలేకపోతున్నామని స్వామీజీ అన్నారు. లక్షలాది మంది అక్కడికి వెళుతున్నా భద్రత అన్నది కనీసం లేదని అన్నారు. నా దేశంలో నా ప్రాంతానికి వెళ్ళడానికి భద్రత లేదని స్వామీజీ అన్నారు. బీజేపీ కోరుకుంటోంది ఒకటేనని.. అఖండ భారతమని.. అనుకున్నది సాధించే దిశగా అడుగులు పడుతున్నాయని స్వామి పరిపూర్ణానంద అన్నారు.