Thursday, April 25, 2019
Follow Us on :

అందుకే రాముడికి శ్రీరామచంద్ర మూర్తి అని పేరు వ‌చ్చింది: స‌్వామి ప‌రిపూర్ణానంద‌

By BhaaratToday | Published On Apr 15th, 2019

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో స్వామి పరిపూర్ణానంద ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జ‌రిగింది.  ఈ సంద‌ర్భంగా స్వామీజీ మాట్లాడుతూ రాముడు రవి అంశలో.. రవి వంశంలో జన్మించాడని, చంద్రుడు చల్లదనానికి.. సూర్యుడు వేడికి సంకేతమ‌న్నారు. చంద్రుడు అమృతాన్ని.. సూర్యుడు శక్తిని ఇస్తారని, సూర్యుడు ఇచ్చేది ఆరోగ్యమ‌ని, సప్తదాతుల మీద సూర్యుడి ప్రభావం ఉంటుందని చెప్పారు. మనిషికి ఫీలింగ్స్ ఇచ్చేది చంద్రుడని, అందుకే రాముడికి శ్రీ రామ చంద్ర మూర్తి అని పేరు వ‌చ్చింద‌న్నారు. మాతృత్వం, పితృత్వం కలిగిన వ్యక్తిత్వం ఉండాలని రామాయణం చెబుతుందని, రామ లేకుండా రాజ్యాన్ని తెస్తామంటే ఎవరు కూడా సహించర‌న్నారు. అందరికీ కావాల్సింది రామరాజ్యం మాత్రమేన‌ని, రామాయణం చదివిన వ్యక్తి ఈ దేశానికి అవసరమ‌ని స్వామీజీ అభిప్రాయ‌ప‌డ్డారు. సైన్స్ అనేది వాస్తవం, కానీ.. సైన్స్ సత్యం కాలేదు..సున్నా అనే అంకెను కనిపెట్టింది మన భారతీయులే...భారతీయులు కనిపెట్టిన సున్నా తోటే ప్రపంచం నడుస్తోంద‌ని స్వామీజీ అన్నారు. అయ‌తే భాగంలో మొత్తం నీళ్లేన‌ని, అందుకే మొట్టమొదట చేప పుట్టిందన్నారు. నీటి నుంచి ఒక భాగం భూమి బయటకు వ‌చ్చింద‌ని, మ‌న శరీరంలో కూడా మూడు వంతులు నీటిని, ఒక వంతు ఘన పధార్థాన్ని తీసుకోవాల‌న్నారు. ఋషుల ఒడిలో పుట్టిన మనము అదృష్టవంతులమన్నారు. అయితే మనము సమాజంలో, సమూహంలో బతకాలని, సమాజంలో జరిగే అవినీతిని మనమే అరికట్టాల్సిన అవ‌స‌రం ఉంతైనా ఉంద‌ని స్వామీజీ పేర్కొన్నారు. రాముడి గురించి ప్ర‌తి ఒక్క‌రు తెలుసుకోవాల‌ని, ఎలా బ్రతకాలో మనకు నేర్పించింది శ్రీ రాముడే, అందుకే రాముడిని మనము మర్చిపోలేదు..అందుకే రామనవమిని జ‌రుపుకొంటున్నామ‌ని భ‌క్తుల‌కు వివ‌రించారు. నేడు సమాజం అతలాకుతలం అవుతోంద‌ని, అందుకే నేను RHSను స్థాపించాన‌ని స్వామీజీ అన్నారు. గడపలోపల కులం.. గడప దాటితే హిందువులం అనేదే నా నినాద‌మ‌న్నారు.