Saturday, December 14, 2019
Follow Us on :

సైరా.. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు తగ్గదు

By BhaaratToday | Published On Aug 31st, 2019

చిరంజీవి కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'సైరా'. భారీ వ్యయంతో తెరకెక్కుతున్న ఈ సినిమా దక్షిణాది భాషల్లోనే కాకుండా హిందీలో కూడా విడుదల కాబోతోంది.  గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ సినిమాను విడుదల చేయాలనున్నారు. అయితే అదే రోజున హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించిన 'వార్' సినిమా భారీ స్థాయిలో విడుదలవుతోంది.  ఈ రెండూ భారీ ప్రాజెక్ట్స్ కావడంతో సైరా సినిమా విడుదల వాయిదా పడుతుందని వార్తలు వచ్చాయి. 'సైరా' విడుదల అక్టోబర్ 8వ తేదీకి వెళ్లొచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబర్ 2వ తేదీనే విడుదల చేయబోతున్నట్లు కన్ఫర్మ్ చేశారు.