Saturday, October 19, 2019
Follow Us on :

టీమిండియా బౌలర్ల ధాటికి విండీస్ విలవిల

By BhaaratToday | Published On Aug 3rd, 2019

ఫ్లోరిడాలో జరుగుతున్న తొలి టి20 మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు దూసుకెళ్తున్నారు. టాస్ గెలిచిన భారత్..ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ విలవిల్లాడుతోంది. కేవలం 67 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిపోయింది. యువ ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ 2 వికెట్లతో విండీస్ ను హడలెత్తించగా, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్ తలో వికెట్ తో విండీస్ పనిబట్టారు. విండీస్ జట్టులో నికోలాస్ పూరన్ ఒక్కడే 20 పరుగులు చేయగా, ఓపెనర్లు జాన్ కాంప్ బెల్, ఎవిన్ లూయిస్ సహా, షిమ్రోన్ హెట్మెయర్ కూడా డకౌట్ గా వెనుదిరిగారు.