Saturday, December 14, 2019
Follow Us on :

తాడేపల్లి గోశాలలో ఆవుల మృత్యుఘోష

By BhaaratToday | Published On Aug 10th, 2019

విజయవాడ శివారులోని కొత్తూరు తాడేపల్లి గోశాలలో ఒకేసారి 100 ఆవులు మృతి చెందాయి. మరి కొన్ని ఆవుల పరిస్థితి విషమంగా ఉంది. రాత్రి ఆవులకు పెట్టిన దాణాలో ఏదో తేడా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతి చెందిన ఆవులకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. గోశాలలో ఉన్న మిగిలిన ఆవులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గోశాలలో గతంలోనూ ఇదే విధంగా 30 గోవులు చనిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఒకేసారి 100 ఆవులు చనిపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

పోస్టు మార్టం రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నారు. ఆహారంలో తేడాల వలన ఈ ఘటన జరిగిందని పశుసంవర్ధక శాఖ అధికారులు అంటున్నారు. యాజమాన్యం ఉద్దేశ్యపూర్వకంగా తప్పు చేయలేదని అంటున్నారు.