Wednesday, October 16, 2019
Follow Us on :

ఎవరినైనా పైకి ఎత్తాలన్నా, కింద పడేయాలన్నా చంద్రబాబు కు వెన్నతో పెట్టిన విద్య: తలసాని

By BhaaratToday | Published On Feb 14th, 2019

తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు. విజయవాడలో తలసాని మాట్లాడుతూ.. తాను ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించి వెళితే, యాదవ సంఘాల నాయకులను, తన వారిని వేధింస్తున్నారని చెప్పుకొచ్చారు. ఏపీలో వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే అయినా, ఇక్కడి పాలకుల్లా దిగజారుడు రాజకీయాలను తామెన్నడూ పాల్పడదని వ్యాఖ్యానించారు. మాట్లాడితే ఏపీ ప్రభుత్వం రెవెన్యూ లోటు గురించి పదేపదే చెబుతోందని, ఆదాయం లేని చోట ఆర్భాట ప్రచారాలు ఎందుకని దుయ్యబట్టారు. తెలంగాణలో తాము 24 గంటలూ కరెంట్ ఇస్తున్నామని, ఏపీలో మాటలకు మాత్రమే పరిమితం తప్ప క్షేత్రస్థాయిలో అది అమలు కావడం లేదని విమర్శించారు. ఇప్పుడు చంద్రబాబు ఇస్తున్న డబ్బులన్నీ ఎన్నికల్లో ఓట్లను కొనుగోలు చేసేందుకేనని, ఎన్నికల తరువాత చేతులెత్తేస్తారని అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మాండమైన తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తలసాని జోస్యం చెప్పారు.