Saturday, October 19, 2019
Follow Us on :

రౌడీ అంకుల్స్.. కత్తులతో కేక్ కట్ చేశారు.. ఆ తర్వాత..!

By BhaaratToday | Published On Sep 2nd, 2019

బర్త్ డే పార్టీ చేసుకునే సమయంలో ఎవరైనా చిన్న చిన్న కత్తులతో కేక్స్ కోస్తారు..! కానీ ఆ రౌడీ అంకుల్స్ మాత్రం తమ రేంజి చూపించడం కోసం పెద్ద పెద్ద కత్తులతో కేక్ కట్ చేశారు. ఆ తర్వాత అంకుల్స్ ఫ్యాన్స్ ఫోటోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అవి అలా షేర్ చేయడంతో.. ఫోటోలు కాస్తా వైరల్ అయి పోలీసుల కంట్లో పడ్డాయి. ఇంకేముంది రౌడీ అంకుల్స్ ను పోలీసు స్టేషన్ కు పిలిపించి విచారించారు. ఇద్దరు రౌడీలను పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు.

తమిళనాడులోని కోయంబత్తూరులో పుట్టిన రోజు సందర్భంగా రౌడీలు కత్తులతో కేక్ కోసి ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఫొటోలు వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. కోయంబత్తూరు సమీపంలోని శివనంతపురానికి చెందిన సతీశ్ కుమార్, సుందర్‌లను అరెస్ట్ చేశారు. బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న మరో 9 మంది కోసం కూడా గాలిస్తున్నారు. బాగా గ్రాండ్ గా పార్టీ చేసుకున్న రౌడీ అంకుల్స్ ఇప్పుడు జైల్లో ఉన్నారు.