Thursday, October 17, 2019
Follow Us on :

నేడు 135 స్థానాల‌కు టీడీపీ అభ్య‌ర్థుల ఖ‌రారు..!

By BhaaratToday | Published On Mar 14th, 2019

అభ్యర్థుల ఖరారులో ముందున్న టీడీపీ గురువారం మొదటి విడుత జాబితాను విడుదల చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే 135స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. గురువారం ఉదయం  పొలిట్‌బ్యూరో సమావేశంలోనూ, ఆ తర్వాత మంత్రులతో జరిగే సమావేశంలో చర్చించాక జాబితాను ప్రకటించనున్నారు. ఇప్పటికే పొలిట్‌బ్యూరో సభ్యులు, మంత్రులు అమరావతికి రావాలని చంద్రబాబు ఆదేశించిన‌ట్లు తెలిసింది. ఈ సమావేశంలో ఖారారైన అభ్యర్థులపై అందరితో చర్చించి, ఆ తర్వాత అభ్యర్థుల జాబితాను ప్రకటించ‌నున్నారు.

అభ్యర్థుల ప్రకటనపై గురువారం జరిగే సమావేశంలో చంద్రబాబు నేతలతో సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. పొలిట్‌బ్యూరో సమావేశంలో ఎందుకు టికెట్లు ఇచ్చాం... ఏ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించామనే అనే అంశాలపై నేతలకు చంద్రబాబు వివ‌రించ‌నున్న‌ట్లు స‌మాచారం. తర్వాత జరిగే మంత్రుల సమావేశంలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించి అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారని చెబుతున్నారు. అయితే చంద్రబాబు జాబితాను విడుదల చేసిన తర్వాత జగన్ కూడా మొదటి జాబితాను ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది.