Thursday, July 18, 2019
Follow Us on :

మే 23న చంద్రబాబుకు పట్టాభిషేకం..!

By BhaaratToday | Published On Apr 14th, 2019

మే 23న రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకి పట్టాభిషేకం చేయనున్నారని ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న అభిప్రాయపడ్డారు. విజయవాడలో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. ఈవీఎం లోపాలపై టీడీపీ  అధినేత చంద్రబాబు నాయుడు పోరాటం చేస్తుంటే, ఆయనకు ఓటమి భయం పట్టుకుందంటూ విపక్ష నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని అవాకులు చవాకులు పేలినా.. ఐదేళ్ల పాటు ప్రజల సంక్షేమం కోసం పనిచేసిన చంద్రబాబే మళ్లీ అధికారంలోకి వస్తారన్నారు. ఈవీఎంలు పనిచేయక మహిళలు, వృద్ధులు ఇబ్బందులు పడితే.. వైసీపీ నేత విజయసాయి రెడ్డి ఈసీ బాగా పనిచేసిందంటూ కితాబివ్వడమేంటని ప్రశ్నించారు. అధికారంలోకి రాకముందే అరాచకాలు సృష్టిన్న వైసీపీ.. భవిష్యత్తులో రాష్ట్రాన్ని రావణకాష్ఠం చేస్తారేమోనంటూ అనుమానం వ్యక్తం చేశారు.