Monday, December 09, 2019
Follow Us on :

మోదీతో భేటీ అయిన ఎంపీలు

By BhaaratToday | Published On Jun 21st, 2019

తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరి, టీజీ వెంకటేష్‌, సీఎం రమేష్‌లు నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. మోదీని మర్యాదపూర్వకంగానే కలిశామని ఎంపీలు తెలిపారు. ఎంపీలతోపాటు కేంద్ర హోంశాఖ‌ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి కూడా ప్రధానిని కలిశారు. ఇక.. సుజనా చౌదరి, సీఎం రమేష్‌, టీజీ వెంకటేష్‌, గరికపాటి మోహనరావులు లేఖ రాయడంతో.. రాజ్యసభలోని తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీని బీజేపీలో విలీనానికి రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఆమోద ముద్ర వేశారు.